News15th Oct 04:37 PMSunil Byrisetty1 min read

2027 నాటికి మానవసహిత గగన్‌యాన్‌

2027 నాటికి మానవసహిత గగన్‌యాన్‌ ప్రయోగానికి చర్యలు తీసుకుంటున్నామని ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు. 2040 నాటికి లూనార్‌ మిషన్‌ చేపట్టాలని ప్రధాని కోరుకుంటున్నారన్నారు. చంద్రుడి

2027 నాటికి మానవసహిత గగన్‌యాన్‌
2027 నాటికి మానవసహిత గగన్‌యాన్‌ ప్రయోగానికి చర్యలు తీసుకుంటున్నామని ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు. 2040 నాటికి లూనార్‌ మిషన్‌ చేపట్టాలని ప్రధాని కోరుకుంటున్నారన్నారు. చంద్రుడి వద్దకు పౌరులను తీసుకెళ్లి, తీసుకువచ్చేలా మిషన్‌ చేపట్టాలని సూచించినట్లు చెప్పారు. ఇస్రో 34 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను ప్రయోగించిందన్నారు. భూకక్ష్యలోకి 80 వేల కిలోల బరువు మోసుకెళ్లే రాకెట్‌ నిర్మించాలనేదే లక్ష్యమన్నారు. ఆదిత్య ఎల్‌1 మిషన్‌ 15 టెరాబిట్లకు పైగా సౌర డేటా అందించిందని, కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్లు, అంతరిక్ష వాతావరణంపై డేటా ఇచ్చిందని ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ వివరించారు.
India In Space
ISRO
Gaganyaan
Space Mission
Narayanan
Aditya L1
Lunar Mission
Indian Space Program
Space Research
Make In India
చంద్ర మిషన్
చంద్రయాన్
విజ్ఞానం మరియు సాంకేతికత
Scroll for the next article