TTD19th Jul 12:30 PMSunil Byrisetty1 min read
తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఇస్రో
తిరుమల తిరుపతి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. ఈ ప్రణాళికల రూపకల్పనలో ఇస్రో సేవలను వినియోగించుకునేందుకు టీటీడీ సిద్ధమవుతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. ఈ ప్రణాళికల రూపకల్పనలో ఇస్రో సేవలను వినియోగించుకునేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. కొన్నేళ్లుగా ముఖ్య వాహన సేవల్లో పాల్గొంటున్న భక్తుల సంఖ్యను దేవస్థానం సుమారుగా లెక్కిస్తోంది.
సెప్టెంబరు 24 ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గరుడోత్సవం రోజున మాడవీధులు, బయట ఎంతమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందన్నది అత్యాధునిక శాటిలైట్ల ద్వారా గుర్తించాలని భావిస్తోంది. ఆ విధంగా సమాచారాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా తగిన ఏర్పాట్లు చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు.