Technology16th May 11:20 AMSunil Byrisetty1 min read

ఇస్రో రికార్డ్.. 101వ రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సెంచరీ కొట్టి దూసుకెళ్తోంది. ఈ ఏడాది జనవరిలో 100 రాకెట్‌ ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో తర్వాతి రాకెట్‌ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ నెల 18న శ్రీహరికో

ఇస్రో రికార్డ్.. 101వ రాకెట్‌ ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సెంచరీ కొట్టి దూసుకెళ్తోంది. ఈ ఏడాది జనవరిలో 100 రాకెట్‌ ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో తర్వాతి రాకెట్‌ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ నెల 18న శ్రీహరికోటలోని షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి61ను ప్రయోగించనుంది. ఇది ఇస్రోకు 101వ రాకెట్‌ ప్రయోగం కానుంది. దీని ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం (ఈఓఎస్‌) రిశాట్‌-18ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. శనివారం ఉదయం 7.59 గంటలకు ఈ మిషన్‌ కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. నిరంతరాయంగా 22 గంటలపాటు కొనసాగిన తర్వాత ఆదివారం ఉదయం 5:59 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఇస్రో అధిపతి నారాయణన్‌ గురువారం షార్‌కు చేరుకున్నారు.
isro
satellite
Sriharikota
PSLV-C61
ఇస్రోకు 101వ రాకెట్‌ ప్రయోగం
ఇస్రో అధిపతి నారాయణ
Scroll for the next article