Technology22nd Aug 03:21 PMSunil Byrisetty1 min read

రాకెట్లకు బైబై.. పరిశోధనలే కీలకం

ఇకపై ఇస్రో ఒక తయారీ సంస్థగా కాకుండా ప్రధానంగా పరిశోధన, అభివృద్ధి సంస్థగా పనిచేయనుంది. కొత్త సాంకేతికతలు, శాస్త్రీయ మిషన్లు, ప్రత్యేక ఉపగ్రహాలు, అధునాతన అంతరిక్ష మౌలిక వసతుల అభివృద్

రాకెట్లకు బైబై.. పరిశోధనలే కీలకం
ఇకపై ఇస్రో ఒక తయారీ సంస్థగా కాకుండా ప్రధానంగా పరిశోధన, అభివృద్ధి సంస్థగా పనిచేయనుంది. కొత్త సాంకేతికతలు, శాస్త్రీయ మిషన్లు, ప్రత్యేక ఉపగ్రహాలు, అధునాతన అంతరిక్ష మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించనుంది. ఒక సాంకేతికత అభివృద్ధి చెంది వాణిజ్యపరంగా వినియోగించేందుకు సిద్ధమైన తర్వాత దానిని ప్రైవేట్‌ సంస్థలకు బదిలీ చేస్తామని గోయెంకా చెప్పారు. ఇప్పటివరకు ఇస్రోకు చెందిన 120 సాంకేతికతలను ప్రైవేట్‌ రంగానికి బదిలీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త లాంచ్‌ సెంటర్‌ నిర్వహణ బాధ్యతలను కూడా ప్రైవేట్‌ రంగానికి అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఆపరేటర్‌ను వచ్చే నాలుగు లేదా ఐదు నెలల్లో ఖరారు చేసే అవకాశం ఉందని గోయెంకా తెలిపారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం ఉన్న సుమారు 8 బిలియన్‌ డాలర్ల నుంచి 2033 నాటికి 44 బిలియన్‌ డాలర్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ISRO
Indian Space Research Organisation
Space Research
R&D
Rocket Manufacturing
Space Technology
Private Sector
అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ
భారత అంతరిక్ష రంగం
స్పేస్ టెక్నాలజీ
ఉపగ్రహాలు
పరిశోధన అభివృద్ధి
Scroll for the next article