News12th Nov 02:09 PMSunil Byrisetty1 min read
విశాఖకు ఐటీ సంస్థల క్యూ
ఐటీ రంగానికి కేంద్రంగా విశాఖపట్నం అవతరిస్తోంది. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో కొత్త ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ సంస్థ క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లి
ఐటీ రంగానికి కేంద్రంగా విశాఖపట్నం అవతరిస్తోంది. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో కొత్త ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ సంస్థ క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.115 కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 2 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ఎకరా కోటి రూపాయల చొప్పున మొత్తం 4 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/మెషిన్ లెర్నింగ్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతిక విభాగాలతో ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 కింద కంపెనీకి అవసరమైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనుంది.