News12th Mar 03:44 PMSunil Byrisetty1 min read

దేవస్థానం పవిత్రత ప్రభుత్వ బాధ్యత...

హిందువుల మనోభావాలను, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను పరిరక్షించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావ

దేవస్థానం పవిత్రత ప్రభుత్వ బాధ్యత...
హిందువుల మనోభావాలను, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను పరిరక్షించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలోని లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 నివాసితులు బత్తుల రవికుమార్, శ్రీదేవి దంపతుల కుమారుడు శ్రీసాయి చరణ్, చక్వాణయజ్ఞ వివాహ కానుకగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి కూరగాయలను వితరణ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో హిందువుల మనోభావాలను అగౌరవపరిచేలా ఎన్నో సంఘటనలు జరిగాయన్నారు. ప్రధానంగా కల్తీ నెయ్యితో లడ్లు తయారీ, అన్యమత ప్రచారం వంటి అనైతిక ఘటనలు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కూటమి ప్రభుత్వం దేవస్థానం పవిత్రతను కాపాడుతోందన్నారు.
TTD
Andhra Pradesh
Scroll for the next article