Education8th May 05:01 PMSunil Byrisetty1 min read
లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
అద్భుత ప్రతిభతో లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన నలుగురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. సత్యవేడులో ఉదయం నిర్వహి
అద్భుత ప్రతిభతో లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన నలుగురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. సత్యవేడులో ఉదయం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు మంత్రి నారా లోకేష్‌ను కలిశారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మంగళపల్లి జడ్పీ హైస్కూల్‌కు చెందిన హేమ, పునీత్ సాయి, లహరి, రేవతి అనే విద్యార్థులు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
“పై (π) “ వాల్యూను ఒక్కొక్కరు 1000 డెసిమెల్స్‌ను చూడకుండా చెప్పి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు.
విద్యార్థుల ప్రతిభను ఈ సందర్భంగా మెచ్చుకున్న మంత్రి లోకేష్.. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.