News9th Oct 11:10 AMSunil Byrisetty1 min read

విశాఖ, గుంటూరు నగరాల్లో ఐటీ దాడులు

గుంటూరులో కందిపప్పు కమిషన్ ఏజెంట్ వెంకటేశ్వరరావు నివాసం, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. విశాఖలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడి నివాసంలోనూ స

విశాఖ, గుంటూరు నగరాల్లో ఐటీ దాడులు
గుంటూరులో కందిపప్పు కమిషన్ ఏజెంట్ వెంకటేశ్వరరావు నివాసం, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. విశాఖలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడి నివాసంలోనూ సోదాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు నిర్వహిస్తున్న సోదాలు రెండో రోజు కూడా కొనసాగాయి. కందిపప్పు కమీషన్ ఏజెంట్ వెంకటేశ్వరరావు నివాసం, కార్యాలయాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కందిపప్పు సరఫరా కాంట్రాక్టు పొందిన వెంకటేశ్వరరావు భారీ స్థాయిలో వ్యాపారం చేసి కూడా ఆదాయ పన్నులు చెల్లించలేదని అధికారులు గుర్తించారు. ఆయన గత 30 ఏళ్లుగా కమీషన్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్, బంగారం వ్యాపారం కూడా చేస్తున్నట్లు సమాచారం.
Andhra Pradesh
Visakhapatnam
Guntur
IT raids
Income Tax Department
Kandipappu commission agent
Venkateswara Rao
real estate
బంగారం వ్యాపారం
వైసీపీ ప్రభుత్వం
సోదాలు
Scroll for the next article