News19th Mar 11:08 AMSunil Byrisetty1 min read

క్రేన్‌పై ఐటీ దాడులు

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఆదాయపన్ను శాఖ(ఐటీ) దాడులు ఉధృతమవుతున్నాయి. తాజాగా శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ శాఖ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఆ తనిఖీల్లో పెద్ద ఎత్తున పత్రాలు, పన్ను

క్రేన్‌పై ఐటీ దాడులు
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఆదాయపన్ను శాఖ(ఐటీ) దాడులు ఉధృతమవుతున్నాయి. తాజాగా శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ శాఖ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఆ తనిఖీల్లో పెద్ద ఎత్తున పత్రాలు, పన్ను చెల్లించని ఆదాయం భారీగా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఇప్పుడు గుంటూరులో క్రేన్ వక్కపొడి సంస్థలపై ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరులో ఉన్న క్రేన్ పరిశ్రమ, ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నాలుగు గంటలుగా క్రేన్ సంస్థల దస్త్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
IT Raids
Crane Compines
Guntur
ఇట్ రైడ్స్
క్రేన్ కంపెనీలు
గుంటూరు
Scroll for the next article