Education10th Mar 05:49 PMSunil Byrisetty1 min read

శ్రీ చైతన్య కళాశాలల్లో ఐటీ కీలక సోదాలు?

దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య కళాశాలల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఆంద్రా, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు చెన్నైలో సోదాలు చేపడుతోంది. శ్రీచైతన్య విద్యాసం

శ్రీ చైతన్య కళాశాలల్లో ఐటీ కీలక సోదాలు?
దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య కళాశాలల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఆంద్రా, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు చెన్నైలో సోదాలు చేపడుతోంది. శ్రీచైతన్య విద్యాసంస్థలు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయి. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్న ఈ విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజులు తీసుకొని ట్యాక్స్ ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. అందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేసుకుని ఫీజులు వసూలు చేస్తోందనని, ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మాదాపూర్ లోని శ్రీచైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
Sri Chaitanya College
Telangan
IT Raids
శ్రీ చైతన్య కళాశాల
తెలంగాణ
ఐటీ రైడ్స్
Scroll for the next article