Politics20th Aug 06:00 PMSunil Byrisetty1 min read

జాబ్స్ అమ్ముకున్నారు.. సాక్ష్యాలున్నాయి

ఏపీలో స్పోర్ట్స్ కోటాలోని డీఎస్సీ జాబ్స్ని అమ్ముకున్నారని మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు చేశారు. అభ్యర్థులతో కొందరు వ్యక్తుల బేరసారాలు జరిపిన ఆడియో కాల్స్ డేటాను ఆయన బయటపెట్టారు. గ్ర

జాబ్స్ అమ్ముకున్నారు.. సాక్ష్యాలున్నాయి
ఏపీలో స్పోర్ట్స్ కోటాలోని డీఎస్సీ జాబ్స్ని అమ్ముకున్నారని మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు చేశారు. అభ్యర్థులతో కొందరు వ్యక్తుల బేరసారాలు జరిపిన ఆడియో కాల్స్ డేటాను ఆయన బయటపెట్టారు. గ్రూప్ -1పై సీబీఐ విచారణకు జగన్ సిద్ధమన్నారు. 2025 డీఎస్సీపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. తాము గ్రూప్-1 విషయంలో తప్పు చేయలేదు కాబట్టి తలఎత్తుకొని అడుగుతున్నామని అన్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని కోర్టును కూడా ఆశ్రయించామన్నారు. సీబీఐతో విచారణ చేయాలని కేంద్ర హోంమంత్రిని కోరామని చెప్పడంతోపాటు మోదీకి లేఖ రాశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డీఎస్సీ అక్రమాల నుంచి తన కుమారుడు లోకేష్‌ను కాపాడుకునేందుకు ఏపీపీఎస్సీ గ్రూప్-1 పోస్టుల భర్తీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
Andhra Pradesh
YS Jagan Mohan Reddy
Jagan
Chandrababu Naidu
AP DSC
DSC Recruitment 2025
Sports Quota Jobs
APPSC Group 1
CBI Probe
నియామక అక్రమాలు
ఉద్యోగాల అక్రమాలు
లోకేష్
రాజకీయ వార్తలు
Scroll for the next article