Politics25th Aug 03:57 PMSunil Byrisetty1 min read
బలమైన అభ్యర్థులను నిలబెడదాం.. పోరాడదాం
స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేతజగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ ము
స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేతజగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ ముఖ్యనేతలతో భేటీ అయిన వైఎస్ జగన్.. ‘‘ఇవి గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావు. మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఓటేస్తారు. అందుకే సీఎం చంద్రబాబు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనివ్వరు. స్థానిక ఎన్నికలను నేతలు ఆషామాషీగా తీసుకోవద్దు. బలమైన అభ్యర్థులను నిలబెడదాం. గతంలో.. ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశాం. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలి. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే, రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడు’ అని పేర్కొన్నారు.