Politics5th Oct 02:16 PMSunil Byrisetty1 min read
సీఎంపై జగన్ ఫైర్ ట్వీట్!
మద్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారని మాజీ ముఖ్యమంత్రి వై
మద్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకాని, లిక్కర్ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీనాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కిందివరకూ వీరంతా పంచుకుంటున్నారని విమర్శించారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోందని పేర్కొన్నారు. లిక్కర్ సిండికేట్లకు, గ్రామస్థాయి వరకూ విస్తరించిన బెల్టుషాపుల మాఫియాలకు, కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డురాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారని మండిపడ్డారు. ఉద్దేశ పూర్వకంగా వాటిని తీసివేసి, వాటి స్థానంలో టీడీపీ సిండికేట్లకు అప్పగించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే, బెల్టుషాపులు టీడీపీ వాళ్లవే, ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లు టీడీపీ వాళ్లవే, అక్రమ మద్యం తయారీ దారులు కూడా టీడీపీ నేతలేనంటూ ట్వీట్ చేశారు.