Politics24th Oct 03:36 PMSunil Byrisetty1 min read
ఎస్ఈసీనే భయపెట్టిన చరిత్ర జగన్ ది
గత వైసీపీ పాలనలో జరిగిన స్థానిక సంస్థల్లో 24 శాతం ఏకగ్రీవాలు చేసుకున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజ్యాంగ పదవిలో పనిచేసిన వ్యక్తి అరాచకాలు సృష్టించి ఏకంగా అప్ప
గత వైసీపీ పాలనలో జరిగిన స్థానిక సంస్థల్లో 24 శాతం ఏకగ్రీవాలు చేసుకున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజ్యాంగ పదవిలో పనిచేసిన వ్యక్తి అరాచకాలు సృష్టించి ఏకంగా అప్పటి ఎస్ఈసీనే భయపెట్టారని మండిపడ్డారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. 28 జిల్లాల్లో 9829 ఎంపీటీసీలకు గానూ మొత్తం 51,902 నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. 28 జిల్లాల్లో 659 జెడ్పీటీసీ స్థానాలకు గానూ మొత్తం 5724 నామినేషన్లు దాఖలు అయ్యాయన్నారు. బెంగుళూరు నుంచి వచ్చి హిట్ అండ్ రన్ తరహాలో బురద చల్లేసి వెళ్లిపోతున్నారంటూ జగన్ పై విమర్శలు చేశారు. రాజకీయ పార్టీగా వైసీపీ దాడులకు తెగబడింది, హింసకు ప్రేరేపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ఎప్పుడూ హింసకు పాల్పడదు, ప్రేరేపించదని, శాంతి భద్రతలకు ఎట్టిపరిస్థితుల్లోనూ విఘాతం కలగనివ్వబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.