Politics2nd May 11:55 AMSunil Byrisetty1 min read
కేంద్ర కులగణన ప్రకటనకు ప్రేరణ జగనే
కేంద్రప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన కులగణనకు ప్రేరణ ఆనాడు ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలేనని మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస
కేంద్రప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన కులగణనకు ప్రేరణ ఆనాడు ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలేనని మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు.
రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ జనగణనలోనే కులగణన చేర్చాలని 2021లోనే వైయస్ జగన్ బీహార్ రాష్ట్రం కంటే ముందుగానే ప్రతిపాదించారని వెల్లడించారు.
అంతేకాకుండా ఆ మేరకు ఏపీ శాసనసభ, శాసనమండలిలో తీర్మానం చేసి, దానిని కేంద్రానికి కూడా పంపించారని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలన్న నిర్ణయాన్ని వైయస్ఆర్‌సీపీ స్వాగతిస్తోందన్నారు.
వైయస్ జగన్ పాలనలో 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా పడిందన్నారు.
వివిధ సామాజికవర్గాల స్థితిగతులు, సమస్యలపై అధ్యయనం చేయడానికి కులగుణన సరైన మార్గమని ఆనాడు వైయస్ జగన్ భావించారని గుర్తు చేశారు.