Politics20th Dec 04:49 PMSunil Byrisetty1 min read
మళ్లీ మొదటికి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
వైఎస్ జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ మరోసారి మొదటికి చేరినట్టైంది. నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయాధికారి రఘురాంను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఈ నెల 22
వైఎస్ జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ మరోసారి మొదటికి చేరినట్టైంది. నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయాధికారి రఘురాంను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఈ నెల 22 తర్వాత రిలీవ్ చేసి, 29లోపు కొత్త పోస్టులో చేరాలని ఆదేశించారు. కొత్త న్యాయాధికారిగా పట్టాభిరామారావును నియమించారు.
న్యాయాధికారి మారిన ప్రతిసారి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మళ్లీ ప్రారంభ దశకు వెళ్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్ల తరబడి కేసు కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ పూర్తికాకపోవడం గమనార్హం. ప్రధాన కేసులు ట్రయల్‌కు వెళ్లకుండా, వరుసగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసి జగన్ విచారణను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులను వేగంగా విచారించి తీర్పులు వెల్లడించాలని సుప్రీంకోర్టు, హైకోర్టులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, వాస్తవంగా విచారణ ముందుకు సాగకపోవడం న్యాయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.