Politics23rd Jun 05:40 PMSunil Byrisetty1 min read

సింగయ్య మృతికి జగన్ నిర్లక్ష్యమే కారణం

సింగయ్య మృతికి ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే కారణమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆరోపించారు. క్షమాపణ చెప్పకుండా ఫేక్ వీడియో అని మభ్యపెట్టడం దారుణమన్నారు. జగన్‌కి మానవత్వ

సింగయ్య మృతికి జగన్ నిర్లక్ష్యమే కారణం
సింగయ్య మృతికి ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే కారణమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆరోపించారు. క్షమాపణ చెప్పకుండా ఫేక్ వీడియో అని మభ్యపెట్టడం దారుణమన్నారు. జగన్‌కి మానవత్వమే లేదని, ఉంటే సింగయ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శ చేయలేదని ప్రశ్నించారు. మానవత్వం ఉంటే 5 కోట్లో, 10 కోట్లో పరిహారం ఇచ్చి క్షమించమని అడగాలని డిమాండ్ చేశారు. జగన్‌వి బలప్రదర్శన, జన సమీకరణ కార్యక్రమాలు తప్ప ప్రజల కోసం కాదని వ్యాఖ్యానించారు. జగన్ జన సమీకరణ సభలకు అనుమతి ఇవ్వొద్దని, జనాలను చంపకండని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని షర్మిల తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న అందరినీ విచారణకు పిలవాలని కోరారు.
Andhra Pradesh news
Ap politics
Sharmila allegations
Ys jagan
Singayya death
సింగయ్య మృతికి జగన్ నిర్లక్ష్యమే కారణం
పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు
Scroll for the next article