Politics9th Dec 04:35 PMSunil Byrisetty1 min read
వైయస్ జగన్ కడప బిడ్డ కాదు.. కర్నాటక బిడ్డ
మాజీ సీఎం జగన్ కడప బిడ్డ, రాయలసీమ బిడ్డ కాదు కర్నాటక బిడ్డ అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రి అధికారంలోకి రాగానే రాష్ట్రాన
మాజీ సీఎం జగన్ కడప బిడ్డ, రాయలసీమ బిడ్డ కాదు కర్నాటక బిడ్డ అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి వచ్చారని, ఏపీలో తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని వేల కోట్లు అక్రమంగా సంపాదించి కర్నాటకలో పెట్టుబడులు పెట్టారని అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన సందర్భంలో కూడా వేల కోట్లు అక్రమంగా దోపిడీ చేశారని ఆరోపించారు. ఆ డబ్బంతా కర్నాటకలో పెట్టుబడులు పెట్టారని, ఇప్పుడు కూడా రాష్ట్రంపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో వైఎస్ కుటుంబ సభ్యులు కూడా స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నారన్నారు. సురక్షితమైన పరిపాలన కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని చెప్పారు.