Politics1st Jul 04:11 PMSunil Byrisetty1 min read
యువజన విభాగం నుంచి ఎమ్మెల్యే కావడమే లక్ష్యం
రాజకీయాల్లో ఎదుగుదలకు యువజన విభాగంలో పదవి కీలకమని, అది తొలి అడుగు కాగా, ఎమ్మెల్యే కావాలన్నదే ఆ పదవుల్లో ఉన్న వారి లక్ష్యం కావాలని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్
రాజకీయాల్లో ఎదుగుదలకు యువజన విభాగంలో పదవి కీలకమని, అది తొలి అడుగు కాగా, ఎమ్మెల్యే కావాలన్నదే ఆ పదవుల్లో ఉన్న వారి లక్ష్యం కావాలని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలతో నిత్యం మమేకం కావడం, ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించడం, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వారికి అండగా నిల్చి, వారితో కలిసి పోరాడడం.. ఈ మూడు లక్షణాలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, అప్పుడే రాజకీయాల్లో నిలబడి ఎదుగుతారని ఆయన వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయాల్లో ఎదుగుదలకు అవకాశం ఉంటుందని, అందుకే చొరవ చూపి వెంటనే కార్యాచరణ మొదలు పెట్టాలని పార్టీ యువజన విభాగం ప్రతినిధుల సమావేశంలో జగన్ పిలుపునిచ్చారు. నియోజకవర్గస్థాయి ఇంఛార్జ్‌లు ఈరోజు నుంచి మొదలుపెట్టాలని, పిలుపునిస్తే, కనీసం 2 వేల మంది రావాలని, అలా లేకపోతే, ఆ దిశలో ఇంకా కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా ఇది మీ తొలి అడుగు అని, మీ చివరి అడుగు కనీసం ఎమ్మెల్యే కావాలని దిశానిర్దేశం చేశారు.