Politics9th Nov 11:32 AMSunil Byrisetty1 min read

మరో పాదయాత్రకు జగన్ సిద్ధం

వైసీపీ అధినేత జగన్ మరో విడత పాదయాత్రకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. 2029 ఎన్నికల్లో సీనియర్లను పక్కన పెట్టి యువతకు ప్రాధాన్యమిస్తారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల

మరో పాదయాత్రకు జగన్ సిద్ధం
వైసీపీ అధినేత జగన్ మరో విడత పాదయాత్రకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. 2029 ఎన్నికల్లో సీనియర్లను పక్కన పెట్టి యువతకు ప్రాధాన్యమిస్తారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల విద్యార్థి విభాగం నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో విస్తృత అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. అయితే ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో యువతకు అవకాశం కల్పించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో దాదాపు 50 శాతం నియోజకవర్గాలను యువతకు కేటాయిస్తారని సమాచారం. 2027లో పాదయాత్రకు సన్నద్ధం అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇలా ఎంపిక చేసిన యువతకు పాదయాత్ర నిర్వహణ బాధ్యతను అప్పగిస్తారు. అందులో సక్సెస్ అయితే అప్పటికప్పుడు ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటన చేస్తారు.
Andhra Pradesh Politics
YSRCP
Jagan Mohan Reddy
Youth Leadership
Political Strategy
ఎన్నికలు
యువత నాయకత్వం
రాజకీయ వ్యూహం
Scroll for the next article