News23rd Jul 03:54 PMSunil Byrisetty1 min read

త్వరలో ఢిల్లీకి జగన్?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ కోసం కోరారు. అపాయింట్మెంట్ లభిస్తే వచ్చే వారం పార్లమెంట్ ప

త్వరలో ఢిల్లీకి జగన్?
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ కోసం కోరారు. అపాయింట్మెంట్ లభిస్తే వచ్చే వారం పార్లమెంట్ ప్రాంగణంలో వారితో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఏపీలో టీడీపీపై బలంగా వైసీపీ పోరాడుతున్న విషయం తెలిసిందే. నిత్యం ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంతోపాటు ఎక్కడికక్కడ నిరసనలతో హోరెత్తిస్తోంది. మరోవైపు అధికార టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలతో జగన్ భేటీ వ్యవహారం రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది. ప్రధాని, కేంద్ర మంత్రుల వద్ద జగన్ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారనేది కీలకంగా మారింది.
Andhra Pradesh Politics
TDP
NDA
Parliament
YS Jagan Mohan Reddy
YSRCP
Delhi Visit
Narendra Modi
Amit Shah
ఎన్డీయే
పార్లమెంట్
రాజకీయ భేటీ
ఏపీ వార్తలు
జాతీయ రాజకీయాలు
Scroll for the next article