Politics22nd May 01:20 PMSunil Byrisetty1 min read

ప్రైవేట్ వ్యక్తులకు రాష్ట్ర ఖజానా.. జగన్ ఫైర్!

మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మనం యుద్ధం చేస్తోం

ప్రైవేట్ వ్యక్తులకు రాష్ట్ర ఖజానా.. జగన్ ఫైర్!
మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మనం యుద్ధం చేస్తోంది చంద్రబాబుతోనే కాదు.. చెడిపోయిన ఎల్లో మీడియాతో అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చంద్రబాబు చెప్పారని, కానీ అభివృద్ధి ఎక్కడా కనిపించలేదని, సంక్షేమం ఊసే లేదని విమర్శించారు. గత ఏడాదిగా మోసాలతో కాలం గడిపారని, చంద్రబాబు పాలనలో పెట్టుబడులు తగ్గాయని పేర్కొన్నారు. 12 నెలలు పూర్తయ్యినా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు కేవలం 3.08 శాతమేనని.. మరోవైపు, దేశ స్థాయిలో గ్రాస్ టాక్స్ రెవెన్యూ వృద్ధి రేటు 13.76 శాతం ఉందని అన్నారు. ఏపీ ఆదాయం మాత్రం చంద్రబాబు, ఆయన మంత్రుల జేబుల్లోకి వెళ్తోందని జగన్ అన్నారు. ఈ ఏడాది మాత్రమే రూ.81,597 కోట్ల అప్పులు చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,32,671 కోట్ల అప్పులు చేస్తే.. అందులో సగం అప్పులు ఒక్క ఏడాదిలోనే చేశారని విమర్శించారు. రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టడమంటే ఇదేనని వ్యాఖ్యానించారు. విశాఖలో వేల కోట్ల విలువైన భూమని లోకేష్ స్నేహితుడికి 99 పైసలకే కట్టబెట్టారని జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
Andhra Politics
YSRCP
jagan mohan reddy
TDP
private individuals massive scams
రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు
ఈ ఏడాది మాత్రమే రూ.81
597 కోట్ల అప్పు
Scroll for the next article