Politics24th Sep 10:54 AMSunil Byrisetty1 min read
హైకోర్టులో స్పీకర్ రూలింగ్ పై విచారణ
ప్రతిపక్ష హోదాపై హైకోర్టులో విచారణ జరగనుంది. మాజీ సీఎం జగన్ కు శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాను తిరస్కరిస్తూ స్పీకర్ గతంలో రూలింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ అధినేత జగన్ ఏప
ప్రతిపక్ష హోదాపై హైకోర్టులో విచారణ జరగనుంది. మాజీ సీఎం జగన్ కు శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాను తిరస్కరిస్తూ స్పీకర్ గతంలో రూలింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ అధినేత జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ రూలింగ్ ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే స్పీకర్ నిర్ణయంలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందా అనేది తేలాల్సి ఉంది.