Politics22nd Dec 05:46 PMSunil Byrisetty1 min read

పరకామణి దొంగతనాన్ని సమర్థించిన జగన్ క్షమాపణ చెప్పాలి

పరకామణి దొంగతనాన్ని సమర్థించిన జగన్ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. పరకామణి అంటే వెం

పరకామణి దొంగతనాన్ని సమర్థించిన జగన్ క్షమాపణ చెప్పాలి
పరకామణి దొంగతనాన్ని సమర్థించిన జగన్ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. పరకామణి అంటే వెంకటేశ్వరస్వామికి భక్తులు ఇచ్చే కానుకలని గుర్తు చేశారు. భక్తి శ్రద్ధలతో, కష్టపడి సంపాదించిన డబ్బు, బంగారం, నిలువు దోపిడీ, తలనీలాలు వంటివి దేవుడికి సమర్పించుకుంటారని వివరించారు. 1939లో టీటీడీ పేరుతో పాలక మండలి ఏర్పడిందని, ఇప్పటికీ దాదాపు 90 ఏళ్లు అయిందని తెలిపారు. కలియుగంలో ప్రజల కష్టాలను, నష్టాలను అక్రమవాదుల నుంచి కాపాడటానికి శ్రీ వెంకటేశ్వరస్వామివారు దేవదేవుడి రూపంలో అవతరించారని, అలాంటి స్వామివారికి సంబంధించిన కానుకలనే దోచేశారని ఆగ్రహించారు. వైసీపీ హయాంలో రూ.2 కోట్ల విలువైన తలనీలాలు మయన్మార్, థాయ్‌లాండ్ మీదుగా చైనాకు అక్రమంగా తరలించబడుతుండగా అస్సాం రైఫిల్స్ పట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా హిందూ మతంపై దాడి చేయడమే వారి ఏకైక ఎజెండా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh
Parakamani Theft
Tirumala Tirupati Devasthanams
TTD
Lord Venkateswara
YS Jagan Mohan Reddy
YSRCP
TDP
Buchchi Ramprasad
దేవాలయ కానుకలు
హిందూ మతం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
Scroll for the next article