Politics24th Apr 02:53 PMSunil Byrisetty1 min read

గెలుపు కోసం స్ట్రాటజీ.. వ్యూహకర్తలతో జగన్!

గత ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న వైయస్సార్సీపీ తప్పులు దిద్దుకునే పనిలో పడింది. పార్టీ బలోపేతంపై అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా సమూల మార్పులు తీసుక

గెలుపు కోసం స్ట్రాటజీ.. వ్యూహకర్తలతో జగన్!
గత ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న వైయస్సార్సీపీ తప్పులు దిద్దుకునే పనిలో పడింది. పార్టీ బలోపేతంపై అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా సమూల మార్పులు తీసుకురావాలని భావించారు. గత ఎన్నికల్లో తప్పిదాలను గమనించిన జగన్మోహన్ రెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 30 మంది సీనియర్ నేతలతో కూడిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ప్రకటించారు. కార్యకర్తలకు సొంత నిధులతో బీమా సౌకర్యం కల్పించే ఆలోచన చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిలను మార్చుతూ జిల్లాల పర్యటనకు దిగాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. గత ఎన్నికల ముందు 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చి దెబ్బతినడంతో వారిని తిరిగి యధా స్థానాల్లో నియమించాలని చూస్తున్నారు. అందులో భాగంగా కొద్ది రోజులుగా బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో ఐప్యాక్ ప్రతినిధి రిషిరాజ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు వ్యూహకర్తలతో జగన్ సమావేశమై వారి సూచనలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
YSRCP
YS Jagan
new strategies for party reconstruction
పార్టీ బలోపేతం
జిల్లాల పర్యటన
నియోజకవర్గ ఇన్చార్జి
Scroll for the next article