News5th Jan 04:53 PMSunil Byrisetty1 min read
ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ వ్యతిరేకి
ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభిస్తే, జగన్ అప్పట్లో రైతులను రెచ్చగొట్టి అడ్డుకున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్
ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభిస్తే, జగన్ అప్పట్లో రైతులను రెచ్చగొట్టి అడ్డుకున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ పనులు నిలిపివేసి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని ఏళ్ల తరబడి వెనక్కి నెట్టారని విమర్శించారు. ఇప్పుడు పనులు పూర్తయ్యే దశకు వచ్చిన తరువాత తానే చేశానని జగన్ చెప్పుకోవడం ఫేక్ రాజకీయానికి నిదర్శనమని, ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు అభివృద్ధికి కృషి చేశారో, ఎవరు అడ్డుపడ్డారో స్పష్టంగా గుర్తించారని అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో పాటు ప్రతి కీలక మౌలిక వసతి ప్రాజెక్టులోనూ జగన్ వైఖరి అభివృద్ధి నిరోధకమని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిజమైన చిహ్నం చంద్రబాబు నాయుడు నాయకత్వమేనని స్పష్టం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను కొందరు వెనుకబడిన ప్రాంతాలుగా చిత్రీకరిస్తున్నా, వాస్తవానికి ఈ ప్రాంతంలో అపారమైన వనరులు, శ్రమజీవి ప్రజలు ఉన్నారని స్పష్టం చేశారు.