Politics26th Oct 01:11 PMSunil Byrisetty1 min read

విదేశాలకు జగన్

వైసీపీ అధినేత జగన్ 15 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ నెలాఖరులోపు ఎప్పుడైనా 15 రోజుల పాటు యూరప్ వెళ్లే వెసులుబాటు ఉండేలా కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. రాష్ట్రం

విదేశాలకు జగన్
వైసీపీ అధినేత జగన్ 15 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ నెలాఖరులోపు ఎప్పుడైనా 15 రోజుల పాటు యూరప్ వెళ్లే వెసులుబాటు ఉండేలా కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలు జరుగుతున్న సమయంలో.. జగన్ విదేశాలకు వెళ్తే వైసీపీ నేతలు నిరుత్సాహపడతారు. అందుకే స్థానిక పోరు ముగిసే వరకు అంటే వచ్చే నెల మధ్య వరకు ఆయన అందుబాటులో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే, ఎన్నికల ప్రక్రియ చివరి దశకు వచ్చిన వెంటనే .. అంటే నవంబర్ రెండో వారం తర్వాత ఆయన విదేశీ బాట పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడే అసలైన రాజకీయ, కుటుంబ సమీకరణల లింక్ ముడిపడి ఉంది. సరిగ్గా నవంబర్ 25వ తేదీన జగన్ సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి వివాహం జరగనుంది. గత కొంతకాలంగా ఆస్తి వివాదాలు, రాజకీయ విభేదాలతో వైఎస్ కుటుంబంలో అన్నాచెల్లెళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో మేనకోడలి వివాహ వేడుకకు జగన్ హాజరవుతారా లేక విదేశీ పర్యటనకే వెళ్తరా అనేది హాట్ టాపిక్‌గా మారింది.
Scroll for the next article