News24th Jan 05:01 PMSunil Byrisetty1 min read
రీసర్వే.. జగన్ సృష్టించిన భూ వివాదాల పుట్ట
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో చేపట్టిన భూ రీసర్వే అనేది రైతుల మేలు కోసం చేసిన సంస్కరణ కాదు, అది కేవలం భూకబ్జాలకు దారి వేసేందుకు వేసిన ఒక పక్కా వ్యూహమని మంత్రి కొండపల్
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో చేపట్టిన భూ రీసర్వే అనేది రైతుల మేలు కోసం చేసిన సంస్కరణ కాదు, అది కేవలం భూకబ్జాలకు దారి వేసేందుకు వేసిన ఒక పక్కా వ్యూహమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. భూ రీసర్వే అంశంపై జగన్ రెడ్డి క్రెడిట్ తీసుకోవాలని చూడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థపై కనీస అవగాహన లేకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ఈ ప్రయోగం వల్ల ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భూ యజమానులు, సామాన్య రైతులు కోర్టులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. విజయనగరం జిల్లాను ఉదాహరణగా చూపిస్తూ, అక్కడ గత 18 నెలలుగా తాను వ్యక్తిగతంగా జరిపిన సమీక్షలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని మంత్రి తెలిపారు. జిల్లాలో ఉన్న మొత్తం రెవెన్యూ సమస్యల్లో 70 శాతం కేవలం జగన్ సర్కార్ అస్తవ్యస్తంగా నిర్వహించిన రీసర్వే వల్లే తలెత్తాయని వివరించారు. బ్రిటిష్ కాలం నాటి పారదర్శక రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు స్పష్టంగా ఉన్నప్పటికీ.. అధికారులకు శిక్షణ ఇవ్వకుండా, తగిన సమయం కేటాయించకుండా బలవంతంగా రీసర్వేను రుద్దడం వల్ల వ్యవస్థ మొత్తం గందరగోళంలో పడిందని విమర్శించారు.