Agriculture17th Sep 05:32 PMSunil Byrisetty1 min read
20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా నాటలేదు
వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని, 51 శాతానికిపైగా వర్షపాతం లోటుందని, అన్ని జిల్లాలూ వర్షపాతం లోటులోనే ఉన్
వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని, 51 శాతానికిపైగా వర్షపాతం లోటుందని, అన్ని జిల్లాలూ వర్షపాతం లోటులోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 688 మండలాల్లో దాదాపు 628 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయన్నారు. అన్నమయ్య జిల్లాలో 75 శాతం, సత్యసాయి జిల్లాలో 66 శాతం, ప్రకాశం జిల్లాలో 65 శాతం, చిత్తూరులో 58.5 శాతం, కడపలో 57శాతం, తూ.గో.జిల్లాలో 57 శాతం, మార్కాపురం, నంద్యాలలో 56 శాతం - విశాఖలో 54 శాతం, అనంతపురంలో 51 శాతం వర్షపాతం లోటు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 76 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా 56.4 లక్షల ఎకరాలకే పరిమితమైందని, దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదని వివరించారు. పంటను బట్టి ఎకరాకు రూ.25 వేల నుంచి 30 వేలు నష్టపోయారన్నారు. కంది, పత్తి, శనగ, జొన్న, వరి సహా పలు పంటలు దెబ్బతిన్నాయని, పండ్ల తోటలు కూడా కరువు దెబ్బకు ఎండిపోతున్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.