News7th Dec 05:35 PMSunil Byrisetty1 min read
17న గవర్నర్‌తో జగన్ భేటీ
రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణపై రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్‌కు నివేదించేం
రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణపై రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్‌కు నివేదించేందుకు వైసీపీ సిద్ధమైంది. ఈ మేరకు
మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ ను కలవనున్నారు. ఈనెల 17న ఆయనతో భేటీ కానున్నారు. ఆరోజు సా 4 గం.కు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వైయస్ జగన్, గవర్నర్ ని కలవనున్నారు. ఈ మేరకు గవర్నర్ స్పెషల్ సీఎస్ నుంచి వైయస్సార్‌సీపీకి లేఖ అందింది.
కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని గవర్నర్ కి నివేదించడంతో పాటు, పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్ కి చూపించనున్నారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలిస్తున్నారు.