Politics11th Mar 12:34 PMSunil Byrisetty1 min read
జగన్‌కు, చంద్రబాబుకు తేడా లేదు!
ఎన్నికల ముందు ప్రచారంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే, పగలగొట్టాలని, అండగా టీడీపీ ఉంటుందని నారా లోకేష్ అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మంత్రిగా అవే స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారు
ఎన్నికల ముందు ప్రచారంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే, పగలగొట్టాలని, అండగా టీడీపీ ఉంటుందని నారా లోకేష్ అన్నారు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మంత్రిగా అవే స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారు.
ఈ అంశంలో నాడు వైసీపీపై పోరాడామని, ఇప్పుడు టీడీపీపై పోరాడతామని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేత గఫూర్ అన్నారు.
స్మార్ట్ మీటర్ల విషయంలో జగన్‌కు, చంద్రబాబుకు విధానపరంగా ఎలాంటి తేడాలు లేవన్నారు.
మోటార్లకు మీటర్లు బిగించడమంటే రైతు మెడకు ఉరితాళ్లు బిగించడమేనని నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు, నారా లోకేష్ ఊరూరా తిప్పి ప్రచారం చేశారు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తలొగ్గడం దుర్మార్గమన్నారు.
అధికారంలో ఏ పార్టీ ఉన్నా అంతిమంగా నష్టపోయేది రైతులు, సామాన్య ప్రజలేనన్నారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధమని గఫూర్ హెచ్చరించారు.