Politics21st Nov 05:18 PMSunil Byrisetty1 min read
సీఎం చంద్రబాబుకు 9 పేజీల లేఖరాసిన జగన్
సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ 9 పేజీల లేఖ రాశారు. కృష్ణా జలాల పరిరక్షణలో ఏపీ ప్రభుత్వ విఫలమైందన్నారు. KWDT-2 ట్రిబ్యునల్‌లో ఏపీ ప్రయోజనాలపై వాదించాలని డిమాండ్ చేశారు. తెలంగ
సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ 9 పేజీల లేఖ రాశారు.
కృష్ణా జలాల పరిరక్షణలో ఏపీ ప్రభుత్వ విఫలమైందన్నారు.
KWDT-2 ట్రిబ్యునల్‌లో ఏపీ ప్రయోజనాలపై వాదించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు 763 TMCలు కేటాయిస్తే APకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సీమ ప్రాజెక్టులపై TDP నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఆల్మట్టి ఎత్తు పెంపు జరిగిందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం AP హక్కులను తెలంగాణకు వదిలేసిందని ఆరోపించారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 TMCలో..
ఒక్క TMC తగ్గినా APకి అన్యాయం తప్పదని పేర్కొన్నారు. ఏపీ రైతుల ప్రయోజనాలు కాపాడటం చంద్రబాబు బాధ్యత అని జగన్ స్పష్టం చేశారు.