Politics30th Oct 12:34 PMSunil Byrisetty1 min read
స్థానిక ఎన్నికలను అడ్డుకోవడమే జగన్ లక్ష్యం
రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష విమర్శించారు. శుక్రవారం ఆమె విడుదల చేసిన వీడియో మాట్లాడుతూ గ
రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష విమర్శించారు. శుక్రవారం ఆమె విడుదల చేసిన వీడియో మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎక్కడా ప్రశాంతత లేకుండా చేసిన జగన్, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ బాటలో ముందుకు తీసుకెళ్తుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడానికి, ఎన్నికలు సజావుగా జరగకుండా చేయడానికి, ఎన్నికల అనంతరం రాష్ట్రానికి రాబోయే రూ.12,600 కోట్ల నిధులు రాకుండా చేసేందుకు అనేక రకాలుగా ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 22,013 నామినేషన్లు దాఖలు చేయగా, వైసీపీ అభ్యర్థులు 20,556, జనసేన అభ్యర్థులు 4,609, బీజేపీ అభ్యర్థులు 1,150 నామినేషన్లు వేశారని గౌతు శిరీష వివరించారు. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానాలకు టీడీపీ తరఫున 2,078, వైసీపీ తరఫున 1,815, జనసేన నుంచి 679, బీజేపీ నుంచి 225 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని నామినేషన్లు ప్రశాంతంగా జరుగుతుంటే, నామినేషన్లు వేయనివ్వడం లేదంటూ మాట్లాడటం దుర్మార్గమన్నారు.