Politics19th Dec 05:14 PMSunil Byrisetty1 min read
పోలీస్ విచారణకు హాజరైన.. జగన్ బంధువు అర్జున్ రెడ్డి
గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ సీఎం జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వైసీపీధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డి ఓ కేసు నిమిత్తమై
గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ సీఎం జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వైసీపీధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డి ఓ కేసు నిమిత్తమై గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సుమారు మూడు గంటల పాటు అర్జున్ రెడ్డిని సీఐ హనీష్ విచారణ చేశారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు నమోదైన కేసులో అర్జున్ రెడ్డికి సోమవారం 41 ఏ నోటీసులు ఇచ్చారు. నేడు ఆయన హాజరు కాగా విచారణ చేసినట్లు సిఐ హనీష్ తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు.