National29th Jul 10:16 AMSunil Byrisetty1 min read
మోదీకి ట్రంప్ ఫోన్ కాల్ అబద్ధం
పాకిస్థాన్ పై కాల్పుల విరమణ అంశంలో అమెరికా దౌత్యం చేసిందనడంలో నిజం లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో చర్చలో జైశంకర్ సుదీర్ఘ వివర
పాకిస్థాన్ పై కాల్పుల విరమణ అంశంలో అమెరికా దౌత్యం చేసిందనడంలో నిజం లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో చర్చలో జైశంకర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కాల్పుల విరమణకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలు జరగలేదని కుండ బద్దలు కొట్టారు..
అమెరికా మధ్యవర్తిత్వంపై జరుగుతున్న ప్రచారం వట్టిదేనన్నారు. ఏప్రిల్ 22- జూన్ 17 మధ్య ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి ఫోన్ కాల్ చేయలేదని వివరించారు. పాక్ నేరుగా ఫోన్ చేసి సంప్రదించాకే కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చినట్టు చెప్పారు.
అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాల్ చేసి మోదీతో పాకిస్థాన్ భారీ దాడికి పాల్పడనుందని ఆయన చెప్పగా ఒకవేళ అదే జరిగితే మేము అంతకంటే భారీ దాడులతో బదులిస్తామని మోదీ స్పష్టం చేశారని తెలిపారు.