News12th Oct 05:30 PMSunil Byrisetty1 min read

జయహో బీసీ.. బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం

బీసీల అభ్యున్నతి, రాజకీయ సాధికారత, సామాజిక అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు

జయహో బీసీ.. బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం
బీసీల అభ్యున్నతి, రాజకీయ సాధికారత, సామాజిక అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకగా నిలుస్తున్నారని, బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో ఎన్టీఆర్, చంద్రబాబు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. రామచంద్రపురం పట్టణంలోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ స్థాయి బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు.. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అనే అనుబంధం దశాబ్దాలుగా కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారని తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారని విమర్శించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రయత్నించగా, వైఎస్సార్‌సీపీ అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఎదురైన న్యాయపరమైన అడ్డంకుల నేపథ్యంలోనూ, బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీపరంగా 34 నుంచి పైబడి ప్రాతినిధ్యం కల్పించేందుకు కూటమి కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.
Scroll for the next article