News4th Oct 01:55 PMSunil Byrisetty1 min read

రేపు జలజీవన్ మిషన్ ప్రారంభ సభ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి ఎస్. సవిత తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు సాగు, తాగునీరు అందించడమ

రేపు జలజీవన్ మిషన్ ప్రారంభ సభ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి ఎస్. సవిత తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా జల జీవన్ మిషన్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈనెల ఐదున ప్రొద్దుటూరులో జరగనున్న సీఎం పర్యటన సందర్భంగా ఆమె ఏర్పాట్లను టీడీపి జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి, జనసేన నాయకులు రమణ లతో కలిసి పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.30 వేల కోట్లతో జల జీవన్ మిషన్ పనులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. రేపటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరవుతున్నారని తెలిపారు. సుమారు లక్ష మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో భోజనం, రవాణా, ట్రాఫిక్, వైద్య, వసతి, మరుగుదొడ్ల ఏర్పాట్లను పరిశీలిస్తున్నామన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ విస్తరణ, స్టార్టప్ కడప, ఇన్వెస్ట్ కడప, స్మార్ట్ కిచెన్స్‌తో పాటు మున్సిపాలిటీల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామని చెప్పారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసి పెట్టుబడులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Scroll for the next article