News17th Jun 03:18 PMSunil Byrisetty1 min read
జల యోగా ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నాగాయలంక శ్రీరామపాద క్షేత
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో ఈ నెల 18వ తేదీ నిర్వహించబోయే జల యోగా ఈవెంట్ ఏర్పాట్లను అవనిగడ్డ ఎమ్మెల్యే డా. మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. కృష్ణా నదీ జలాల్లో, బోట్లపై చేసే యోగాను అత్యద్భుతంగా నిర్వహించాలని సూచించారు.
కృష్ణానది పుష్కర ఘాట్ వద్ధ అధికారులు చేస్తున్న ఏర్పాట్లపై క్షేత్ర స్థాయి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరనాథ్, ఆయుష్ విభాగం వైద్యాధికారులు, మత్స్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.