News6th Nov 04:30 PMSunil Byrisetty1 min read

డోలేంద్రకు ఎన్జీ రంగా పురస్కారం

అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, జెకెసి కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన గుంటూరులోని జెకెసి కళాశాల ఆడిటోరియంలో ఆచార్య ఎన్.జి. రంగా 127 వ జయంతి సందర్భంగా జమీన్ రైతు

డోలేంద్రకు ఎన్జీ రంగా పురస్కారం
అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, జెకెసి కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన గుంటూరులోని జెకెసి కళాశాల ఆడిటోరియంలో ఆచార్య ఎన్.జి. రంగా 127 వ జయంతి సందర్భంగా జమీన్ రైతు పత్రిక సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ కు ఆచార్య ఎన్.జి.రంగా పురస్కార ప్రధానం జరిగింది. ఈ సందర్భంగా ఆచార్య ఎన్.జి. రంగా 1933లో రచించిన హరిజన నాయకుడు పుస్తకాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు డా. యలమంచిలి శివాజీ ఆవిష్కరించారు. సభాధ్యక్షులుగా జెకెసి కళాశాల ప్రిన్సిపాల్ పరుచూరి గోపీచంద్ వ్యవహరించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ నేతృత్వంలో జరిగిన సభలో కందిమళ్ల శివప్రసాద్, డాక్టర్ అశోక్ లతోపాటు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. పుర ప్రముఖులు, రచయితలతో పాటు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Scroll for the next article