National15th Aug 11:19 AMSunil Byrisetty1 min read

జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదానా.. ఇవి ఆలోచించారా?

దేశ సరిహద్దులు కలిగి ఉన్న సున్నితమైన ప్రాంతం జమ్మూ కశ్మీర్. అలాంటి జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర

జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదానా.. ఇవి ఆలోచించారా?
దేశ సరిహద్దులు కలిగి ఉన్న సున్నితమైన ప్రాంతం జమ్మూ కశ్మీర్. అలాంటి జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర హోదా కల్పించే ముందు స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఉటంకించింది. అక్కడి భీతావహ ఉగ్ర దాడిని విస్మరించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
Jammu and Kashmir
Supreme Court
Statehood
Terror Attack
Pahalgam
BR Gavai
Security Concerns
జమ్మూ కశ్మీర్
సుప్రీంకోర్టు
పిటిషన్లు
ఉగ్రదాడి
పహల్గాం
Scroll for the next article