National15th Nov 09:31 AMSunil Byrisetty1 min read
జమ్ముకశ్మీర్‌లో భారీ పేలుడు.. ఏడుగురు అధికారులు దుర్మరణం
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలిన దుర్ఘటన తర్వాత ఎప్పుడేం జరుగుతుందా అనే భయం నెలకొంది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకు
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలిన దుర్ఘటన తర్వాత ఎప్పుడేం జరుగుతుందా అనే భయం నెలకొంది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న భారీ పేలుడు పదార్థాలు పోలీస్ స్టేషన్‌లోనే పేలడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఇటీవల ఓ ఉగ్రవాద ముఠా నుంచి పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ బృందం సాయంతో పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా అవి పేలిపోయాయి. దీంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణం దద్దరిల్లింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు, నయీబ్ తహసీల్దార్ సహా ఇద్దరు రెవెన్యూ అధికారులు అక్కడికక్కడే మృతి చెందారు.