News10th May 04:28 PMSunil Byrisetty1 min read
ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన ఔషధి మందుల షాపులు
పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులకొచ్చే రోగుల ప్రయోజనార్ధం నాణ్యమైన జనరిక్ మందులను అతి తక్కువ ధరలకే అందించడానికి అన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో జన ఔషధి కేంద్రాల
పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులకొచ్చే రోగుల ప్రయోజనార్ధం నాణ్యమైన జనరిక్ మందులను అతి తక్కువ ధరలకే అందించడానికి అన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ విషయంపై సమీక్షానంతరం ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు.
జిజిహెచ్‌లలో ప్రస్తుతం జనరిక్ మెడికల్ షాపుల నిర్వాహకులు కొన్ని సందర్భాల్లో 50 నుండి 600 శాతం మేరకు లాభాలతో ఈ మందుల్ని విక్రయిస్తున్నారు.
ప్రస్తుతం 16 జిజిహెచ్‌లలో 23 ప్రైవేట్ జనరిక్ మెడిసిన్ స్టోర్లు ఉన్నాయి. నంద్యాల జిజిహెచ్‌లో మాత్రం ఇలాంటి స్టోర్ లేదు.
ప్రభుత్వాసుపత్రుల్లో జనరిక్ మందుల షాపుల్ని నిర్వహించడానికి లాభాపేక్ష లేని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతిపాదనకు మంత్రి ఆమోదం తెలిపారు.