News3rd Jul 04:55 PMSunil Byrisetty1 min read

విద్యుత్ ఒప్పందాలపై పునః సమీక్ష జరపాలి

దశాబ్ద కాలంగా అధికార పార్టీలు ప్రైవేట్ కంపెనీలతో చేస్తున్న విద్యుత్ ఒప్పందాలపై పునః సమీక్ష జరిపి, అవినీతికి పాల్పడిన సంస్థలపై, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, స్మార్ట్ మీట

విద్యుత్ ఒప్పందాలపై పునః సమీక్ష జరపాలి
దశాబ్ద కాలంగా అధికార పార్టీలు ప్రైవేట్ కంపెనీలతో చేస్తున్న విద్యుత్ ఒప్పందాలపై పునః సమీక్ష జరిపి, అవినీతికి పాల్పడిన సంస్థలపై, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.హెచ్. బాబురావు పిలుపునిచ్చారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో విద్యుత్ కుంభకోణాలు - వినియోగదారుల పై భారాలు అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి ప్రధాన వక్తగా హాజరైన బాబురావు ప్రసంగించారు. చర్చా గోష్టికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. బాబురావు ప్రసంగిస్తూ ఆదానీ చేసుకున్న సెకీ ఒప్పందం రాబోయే 25 సంవత్సరాలలో రాష్ట్ర ప్రజలపై లక్ష 20 వేల కోట్ల పెను భారం మోపుతుందని అన్నారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ చేపట్టిన ఒప్పందాల ద్వారా వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందని పేర్కొన్నారు. నేడు ఈ అవకతవకలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి స్పందించక పోవడం దురదృష్టకరమన్నారు. పౌర సమాజం స్పందించి, పెద్ద ఎత్తున ఉద్యమించి, లోప భూయిష్టమైన విద్యుత్ ఒప్పందాలను ఉప సంహరించుకునేటట్లు కృషి జరగాలన్నారు.
Andhra Pradesh news
CPM
C.H. Baburao
electricity scams
Jana Chaitanya Vedika
Vallamreddy Lakshman Reddy
గుంటూరులో విద్యుత్ కుంభకోణాలు
వినియోగదారుల పై భారాలు
Scroll for the next article