Politics25th Sep 09:33 AMSunil Byrisetty1 min read

స్థానిక సమన్వయానికి జనసేన కమిటీ

స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా, జనసేన పార్టీ శ్రేణుల నుండి సమాచారాన్ని సేకరించేందుకు కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీతో సమన్వయం చేయడంతో

స్థానిక సమన్వయానికి జనసేన కమిటీ
స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా, జనసేన పార్టీ శ్రేణుల నుండి సమాచారాన్ని సేకరించేందుకు కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీతో సమన్వయం చేయడంతో పాటు, సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి నివేదించేందుకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక సమన్వయ కమిటీని నియమించారు. ఈ కమిటీలో APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు, విశాఖపట్నం దక్షిణ శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్, భీమవరం నియోజకవర్గానికి చెందిన పులపర్తి ప్రశాంత్, రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన యనమల భాస్కర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ 14 మంది సభ్యుల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీతో సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారాన్ని సేకరించి, అధ్యయనం చేసి పవన్ కళ్యాణ్ కి నివేదించనుంది. వీరు అందించిన నివేదికల ఆధారంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు.
Scroll for the next article