News13th Jan 12:02 PMSunil Byrisetty1 min read

తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన ?

ఏపీలో చురుకుగా పని చేస్తున్న జనసేన పార్టీ తెలంగాణలోనూ అస్తిత్వం చాటుకునేందుకు సిద్ధమవుతోంది. ఆ రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ అడుగులు వేస్తోంది

తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన ?
ఏపీలో చురుకుగా పని చేస్తున్న జనసేన పార్టీ తెలంగాణలోనూ అస్తిత్వం చాటుకునేందుకు సిద్ధమవుతోంది. ఆ రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ అడుగులు వేస్తోంది. తెలంగాణలో పార్టీని బలో పేతం చేసే దిశగా అడుగు లు వేస్తున్న జనసేన, ఇప్పటికే కొత్త అడ్ హాక్ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, జనసేన తనకు పట్టు ఉన్న ప్రాంతాల్లోనే పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఏపీలో బీజేపీ, టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన, తెలంగాణలో కూడా పొత్తుతో పోటీ చేస్తుందా అనే విషయం చర్చనీయాంశమైంది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది.
Jana Sena Party
Telangana elections
municipal elections
Pawan Kalyan
Telangana politics
party expansion
ad hoc committees
కార్పొరేషన్ ఎన్నికలు
బీజేపీ టీడీపీ పొత్తు
రాజకీయ చర్చ
Scroll for the next article