Politics17th Jul 11:18 AMSunil Byrisetty1 min read

జనసేనకు 15 శాతం సీట్లే

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నగారా మోగింది. ఈ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని కూట‌మి వ్యూహాత్మ‌కంగా ముందుకెళుతోంది. ఇందులో భాగంగా మూడు పార్టీలు క‌లిసి స‌మ‌న్వ‌య స‌మావేశాల

జనసేనకు 15 శాతం సీట్లే
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నగారా మోగింది. ఈ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని కూట‌మి వ్యూహాత్మ‌కంగా ముందుకెళుతోంది. ఇందులో భాగంగా మూడు పార్టీలు క‌లిసి స‌మ‌న్వ‌య స‌మావేశాల్ని విస్తృతంగా నిర్వ‌హించ‌డానికి క‌మిటీల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో స్థానిక ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున పోటీ చేసి , క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌ప‌డాల‌ని జ‌న‌సేన నేత‌లు ఉత్సాహం చూపుతున్నారు. అయితే వారి ఉత్సాహంపై నీళ్లు చ‌ల్లేలా మంత్రి నారా లోకేశ్ కామెంట్స్ ఉన్నాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. కొత్త జోన‌ల్ కోఆర్డినేట‌ర్ల‌తో నిర్వ‌హించిన మొద‌టి స‌మావేశంలో ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీల న‌డుమ సీట్ల స‌ర్దుబాటుపై చ‌ర్చ జ‌రిగిన‌ట్టు లోకేశ్ తెలిపారు. 80:15:5 నిష్పత్తిలో సీట్ల సర్దుబాటు ఉంటుందని లోకేశ్ చెప్పారు. టీడీపీ 80 శాతం సీట్లు, జనసేన 15 శాతం, బీజేపీ 5 శాతం సీట్లలో బరిలోకి దిగుతాయని తేల్చి చెప్పారు. దీనిపై జనసేనలో అసంతృప్తి పెరుగుతున్నట్లు సమాచారం
Andhra Pradesh
Local Body Elections
Jana Sena
deputy CM Pawan Kalyan
TDP
BJP
Nara Lokesh
కూటమి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
పంచాయతీ ఎన్నికలు
Scroll for the next article