Politics11th Oct 04:18 PMSunil Byrisetty1 min read

చంద్రబాబును అరెస్ట్.. జనసైనికులు త్యాగం!

రంపచోడవరం పర్యటనలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023లో చంద్రబాబును అరెస్ట్ చేసి, రాజమహేంద్రవరం జైల్లో పెట్టినప్పుడు ఎవరూ రోడ్ల మీదకు రాలేదని చెప్పారు. కానీ

చంద్రబాబును అరెస్ట్.. జనసైనికులు త్యాగం!
రంపచోడవరం పర్యటనలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023లో చంద్రబాబును అరెస్ట్ చేసి, రాజమహేంద్రవరం జైల్లో పెట్టినప్పుడు ఎవరూ రోడ్ల మీదకు రాలేదని చెప్పారు. కానీ అప్పుడు జనసైనికులు వచ్చారన్నారు. కూటమిలోని మూడు పార్టీల్లో జనసేనే చాలా త్యాగం చేసిందని పేర్కొన్నారు. దానికి తగిన ప్రాతినిధ్యం ఇచ్చేలా ప్రతి నాయకుడు అండగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతిఫలంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు ఆశిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు.
Scroll for the next article