Politics18th Aug 04:58 PMSunil Byrisetty1 min read

టీడీపీపై జనసేన ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ టీడీపీపై కీలక వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరలవుతున్నాయి. తెలుగుదేశానికి కాపు కాయడానికి పార్టీ పెట్టలేదని, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ముఖ్య‌మంత్ర

టీడీపీపై జనసేన ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ టీడీపీపై కీలక వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరలవుతున్నాయి. తెలుగుదేశానికి కాపు కాయడానికి పార్టీ పెట్టలేదని, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ముఖ్య‌మంత్రిగా చూడ‌డానికి జ‌న‌సేన పార్టీ పెట్టారని ఆయన వ్యాఖ్యానించిన వీడియో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లాబీలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చిట్ చాట్ చేశారు. తాను అనని మాటలు అన్నట్లు వైసీపీ అవాస్తావాలు ప్రచారం చేస్తుందని చెప్పారు. తాను అనని మాటలు అన్నట్లు వీడియో కట్ అండ్ పేస్ట్ చేసి నాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఫేక్ పార్టీ అని.. ఆ పార్టీ నాయకులు ఫేక్ నాయకులని అన్నారు. 15 ఏళ్ళు పాటు కూటమి కలిసి ఉండాలనేది తమ ఉద్దేశమని, కూటమిలో చిచ్చుపెట్టాలని వైసీపీ చేసే ప్రయత్నాలు ఎప్పటికి ఫలించవని ఎమ్మెల్యే పంతం నానాజీ క్లారిటీ ఇచ్చారు.
Andhra Pradesh
Jana Sena
TDP
Pantam Nanaji
Pawan Kalyan
Politics
NDA Alliance
Political Controversy
వైరల్ వీడియో
వైసీపీ
కూటమి ప్రభుత్వం
అసెంబ్లీ
రాజకీయ వ్యాఖ్యలు
Scroll for the next article