News6th Aug 04:59 PMSunil Byrisetty1 min read

ఇంకో రెండు ఎయిమ్స్ కావాలన్న జనసేన ఎంపీ

ఐదు కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు మంగళగిరి ఎయిమ్స్ ఒకటే సరిపోదని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ అన్నారు. ఏపీలో సూపర్ స్పెషాలిటీ వైద్య రంగాన్ని విస్తరించేందుకు

ఇంకో రెండు ఎయిమ్స్ కావాలన్న జనసేన ఎంపీ
ఐదు కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు మంగళగిరి ఎయిమ్స్ ఒకటే సరిపోదని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ అన్నారు. ఏపీలో సూపర్ స్పెషాలిటీ వైద్య రంగాన్ని విస్తరించేందుకు రాష్ట్రానికి మరో రెండు ఎయిమ్స్‌ ఆసుపత్రులను కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. మంగళగిరి ఎయిమ్స్‌ను పూర్తిస్థాయి జాతీయ స్థాయి వైద్య సంస్థగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు వినతిపత్రం అందజేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కొత్తగా ఎయిమ్స్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా ప్రాంతీయ అసమానతలు తొలగిపోయి, ప్రజలకు ఆధునిక వైద్యం చేరువవుతుందని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్, బీహార్‌లకు ఒకటికి మించి ఎయిమ్స్‌లు మంజూరు చేసిన విషయాన్ని పేర్కొని, ఏపీకి కూడా ఆ అవకాశం ఇవ్వాలని కోరారు.
Andhra Pradesh
Jana Sena
Lingamaneni Ramesh
AIIMS Mangalagiri
JP Nadda
Union Health Ministry
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
రాయలసీమ
ఉత్తరాంధ్ర
వైద్య మౌలిక వసతులు
Scroll for the next article