Politics16th Oct 06:10 PMSunil Byrisetty1 min read
టీడీపీపై జనసేన రెబెల్ నామినేషన్
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కలకలం రేగింది. మున్సిపాలిటీలో జనసేన పార్టీ తిరుగుబాటు జెండా ఎగురవేసింది. రాష్ట్ర స్థాయిలో కూటమి పార్టీల మధ్య కుదిరిన రాజకీయ ఒప్పందాన్ని పట్నం జనసేనలోన
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కలకలం రేగింది. మున్సిపాలిటీలో జనసేన పార్టీ తిరుగుబాటు జెండా ఎగురవేసింది. రాష్ట్ర స్థాయిలో కూటమి పార్టీల మధ్య కుదిరిన రాజకీయ ఒప్పందాన్ని పట్నం జనసేనలోని ఆ పార్టీ రాజకీయ ఎన్నికల కమిటీ సభ్యులే ఉల్లంఘించారు. మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల కేటాయింపులో భాగంగా టీడీపీ వివక్ష చూపుతోందనే కారణంతో ఏకంగా చైర్ పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ కన్వీనర్ సూర్యచంద్ర టీడీపీ చైర్ పర్సన్ అభ్యర్థి పద్మావతి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. జనసేనలో రెండో వర్గంగా ఉన్న జిల్లా జనసేన సమన్వయ కమిటీ సభ్యుడు అప్పన్న దొరబాబు ఆధ్వర్యంలో మరో సమన్వయ కమిటీ సభ్యురాలు, జనసేన మాజీ కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య నర్సీపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కూటమి అభ్యర్థిగా స్పీకర్ అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి నామినేషన్ దాఖలు చేసిన రోజునే జనసేన నాయకులుగా ఉన్న అద్దేపల్లి సౌజన్య చైర్ పర్సన్‌గా నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది.